
హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్‌లో ఆగి ఉన్న రెండు టీఎస్ ఆర్టీసీ బస్సులు మంటలకుగురై పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దిల్సుఖ్నగర్ బస్ డిపోలో నిలిపి ఉంచిన రెండు బస్సులు పూర్తిగా దగ్థమయ్యాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. మంటలను గమనించిన బస్సు డిపో సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపు అందుబాటులో ఉన్న వాటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు మలక్‌పేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీలోని కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు ఫైర్ సిబ్బంది. అయితే పూర్తి స్థాయిలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు డిపో అధికారులు. ప్రమాదానికి గురైన రెండు బస్సులు ఆర్టీసీవే కావడం గమనార్హం. ఫైర్ యాక్సిడెంట్‌కు గల ప్రధాన కారణం తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..