హుస్సేన్‌సాగర్ తీరం కలర్‌ఫుల్‌గా మారిపోయింది. ఒకవైపు ఫార్ములా రేసింగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తే, మరోవైపు సెలబ్రిటీస్ కనువిందు చేశారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తోపాటు టాలీవుడ్ హీరో రామ్‌చరణ్, మహేష్ బాబు కుమారుడు గౌతమ్ రావడంతో ఫార్ములా రేసింగ్‌కి స్టార్ అట్రాక్షన్ వచ్చింది. ఇంకోవైపు దేశ విదేశీ ప్రముఖులు స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఒకవైపు ఫార్ములా కార్లు రివ్వున దూసుకుపోతుంటే, మరోవైపు వీళ్లంతా అదనపు అందాలు తెచ్చారు.
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. మెరుపు వేగంతో దూసుకెళ్తోన్న కార్లను చూసి యువత సరికొత్త అనుభూతి పొందారని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులకు సారీ చెప్పారు.
పైనల్ రేస్‌లో గంటకు 322 కిలోమీటర్ల వాయువేగంతో దూసుకెళ్లాయి కార్లు. గంటన్నర పాటు కొనసాగిన రేసింగ్ పోటీల్లో వరల్డ్ చాంపియన్‌షిప్ విజేత జీన్ ఎరిక్ కాగా.. 2, 3 స్థానాల్లో క్యాసిడీ, సెబాస్టియన్ నిలిచారు.
IT’S P1 FOR @JeanEricVergne IN HYDERABAD ???@GreenkoIndia #HyderabadEPrix pic.twitter.com/GQbtsQ1jsD
— ABB FIA Formula E World Championship (@FIAFormulaE) February 11, 2023
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..