Hyderabad: స్కూల్ ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం..

రోజూలాగే పాఠశాలకు బయల్దేరిన ఆ విద్యార్థులు సాయంత్రం సంతోషంతో ఇంటికి బయల్దేరారు. మరి కొద్ది సమయంలో ఇంటికి వెళ్లిపోతామనుకుంటున్న ఆనందం వారిలో కొంత సమయమైనా నిలవలేదు. లారీ రూపంలో...

Hyderabad: స్కూల్ ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం..
Road Accident

Updated on: Sep 08, 2022 | 8:27 PM

రోజూలాగే పాఠశాలకు బయల్దేరిన ఆ విద్యార్థులు సాయంత్రం సంతోషంతో ఇంటికి బయల్దేరారు. మరి కొద్ది సమయంలో ఇంటికి వెళ్లిపోతామనుకుంటున్న ఆనందం వారిలో కొంత సమయమైనా నిలవలేదు. లారీ రూపంలో ఎదురొచ్చిన ప్రమాదం వారి ప్రాణాలను తీసేసింది. వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చర్లపల్లి (Charlapalli) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థినులు ఈసీఐఎల్‌ నుంచి చర్లపల్లి వైపు ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో పది మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..