Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. కారులోనే ఇరుక్కున్న మృతదేహాలు..

|

Jan 31, 2023 | 9:49 PM

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్‌ అప్పా జంక్షన్‌ వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి..

Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. కారులోనే ఇరుక్కున్న మృతదేహాలు..
Accident
Follow us on

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్‌ అప్పా జంక్షన్‌ వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని స్పాట్ ను, మృతదేహాలను పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఎగ్జిట్‌ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు మరో మహిళ మృతి చెందింది. మృతులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారులోనే మృతదేహాలు ఇరుక్కున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్రేన్‌ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన ఇద్దరు భార్యభర్తలుగా అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి