Telangana: గంపెడు ఆశతో చేపల కోసం చెరువులోకి దిగారు.. తీరా నీటిలో కనిపించింది చూడగా

చేపల వేటకు వెళ్లాలంటే ఆ జాలర్లు దడుసుకుంటున్నారు. చెరువులోకి దిగాలంటే జంకుతున్నారు. ఎందుకంటే.. అందులో రెండు భారీ మొసళ్ళు కాచుకుని కూర్చున్నాయి. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Telangana: గంపెడు ఆశతో చేపల కోసం చెరువులోకి దిగారు.. తీరా నీటిలో కనిపించింది చూడగా
Medak

Updated on: Nov 25, 2025 | 10:05 AM

ఈ మధ్యకాలంలో మనుషులకు అడవి జంతువులు పలకరింపులు చెబుతుండటం సర్వసాధారణమైపోయింది. చిరుతలు సిటీల్లోకి టూర్లకు వస్తుంటే.. వానరాలు విలేజిల్లో సెటిల్ అవుతున్నాయి. అలాగే గుడ్లగూబలు గుడ్‌ మార్నింగ్ చెప్పి.. పెద్ద పులులు పశుసంపదను పట్టుకుపోతుంటే.. కొండచిలువలు కోళ్లు, మేకలను మింగేస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా రెండు మొసళ్ళు ఊరి చెరువులో సెటిల్ అయ్యి.. అందులో ఉన్న చేపలను తమకు ఆహారంగా చేసుకుంటున్నాయి. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులోని పెద్ద చెరువులో మొసళ్ల సంచారం గ్రామస్థులను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చెరువులోకి రెండు మొసళ్లు ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే రెండు నెలల క్రితమే మొసళ్లను చెరువు పరిసరాల్లో గమనించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ చెరువు గట్టు వద్ద మొసళ్లు కనిపించడం మత్స్యకారుల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది. చెరువులో చేపలు పట్టడానికి భయపడుతున్నందున రెండు నెలలుగా తమకు ఉపాధి లేకుండా పోయిందని, మచ్చు సంపదను మొసళ్లు పూర్తిగా తినేస్తున్నాయని మత్స్యకారులు వేదన వ్యక్తం చేస్తున్నారు. మొసళ్ల సంచారంతో గ్రామంలో భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం, అటవీశాఖ వెంటనే జోక్యం చేసుకుని మొసళ్లను బంధించి చెరువును సురక్షితంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.