Telangana: దారితప్పుతున్న విద్యా కుసుమాలు.. గంజాయి‌ సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

| Edited By: Balaraju Goud

Feb 27, 2024 | 1:01 PM

బాసర ట్రిపుల్‌ ఐటీ మరోసారి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ‌ చూసిన డ్రగ్స్ మత్తు కలకలం రేపుతుండగా తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలోను మత్తు కథ బయటపడింది. అత్యంత భద్రతా వలయంలో కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి గంజాయి ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు‌ అనేక అనుమానాలను తెరమీదకు తెచ్చింది. గంజాయి సేవిస్తూ ఇద్దరు విద్యార్థులు‌‌‌ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడటం కలకలం రేపుతోంది.

Telangana: దారితప్పుతున్న విద్యా కుసుమాలు.. గంజాయి‌ సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు
Basara IIIT
Follow us on

బాసర ట్రిపుల్‌ ఐటీ మరోసారి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ‌ చూసిన డ్రగ్స్ మత్తు కలకలం రేపుతుండగా తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలోను మత్తు కథ బయటపడింది. అత్యంత భద్రతా వలయంలో కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి గంజాయి ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు‌ అనేక అనుమానాలను తెరమీదకు తెచ్చింది. గంజాయి సేవిస్తూ ఇద్దరు విద్యార్థులు‌‌‌ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడటం కలకలం రేపుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే తరహాలో ముగ్గురు‌ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడగా క్రమశిక్షణ చర్యలు తీసుకుని ప్రధాన‌గేటు‌ వద్ద సెక్యూరిటీని టైట్ చేసిన మరోసారి క్యాంపస్ లోకి గంజాయి ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపుతోంది.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీలో గంజాయి సేవిస్తూ విద్యార్థులు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ పై ఆదివారం అర్థరాత్రి ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ రిటైర్డ్ ఆర్మీ సిబ్బందికి పట్టుబడ్డారు. అదికారులకు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను క్యాంపస్ పోలీసులకు అప్పగించారు. గంజాయి ఘటనలో పట్టుబడ్డ విద్యార్థులు రీ అడ్మిషన్ విద్యార్థులుగా తేల్చారు అదికారులు. ఫైనల్ ఈయర్ పూర్తి చేసుకుని ఈ3, ఈ4 లో పరీక్షలు పేలవడంతో సప్లమెంటరీ రాసేందుకు తిరిగి‌ కళాశాలకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల వద్దకు గంజాయి ఎలా వచ్చిందనేది తేలాల్సి ఉంది.

ఎక్కడదీ గంజాయి..?

క్యాంపస్‌లో ప్రస్తుతం ఒక డీఎస్పీ, ఒక సీఐ లతోపాటు దాదాపు 20 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది, తాజాగా మరో 20 మంది రిటర్డ్ ఆర్మీ సిబ్బందితో భద్రత కట్టుదిట్డంగా ఉంది. ఇంత భద్రతా సిబ్బంది ఉన్నా క్యాంపస్‌లోకి గంజాయి ఎంట్రీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థుల వద్ద గంజాయి లభ్యమవడంతో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనక ఇంకా ఎవరు ఉన్నారు..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. రీ అడ్మిషన్ లో భాగంగా రెండు రోజుల క్రితమే క్యాంపస్‌లోకి వచ్చిన‌ విద్యార్థుల వద్ద గంజాయి పట్టుబడటం భద్రత డొల్లతనాన్ని తెరమీదకు తెస్తోంది. విద్యార్థులే నేరుగా గంజాయి తెచ్చుకున్నారా లేదా స్థానికంగా పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

బయటకు పొక్కకుండా..

హాస్టల్ గదిలో గంజాయి సేవిస్తున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న సిబ్బంది.. విద్యార్థుల రూమ్ తనిఖీ చేశారు. విషయం బయటకు రాకుండా జాగ్రత్త వహిస్తూ తనిఖీ చేస్తున్న సమయంలో స్థానికంగా సిబ్బందికి సెల్‌ఫోన్స్‌ అనుమతించకుండా గోప్యత వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది‌ క్రితం ముగ్గురు విద్యార్థులు గంజాయి‌ సేవిస్తూ పట్టుబడగా.. సస్పెన్షన్ వేటు వేశారు వీసీ వెంకట రమణ. తాజాగా పట్టుబడిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యల కోసం ఐదుగురు సభ్యుల కమిటీని వేసినట్టు తెలుస్తోంది.

ఆదివారం రాత్రి ఇద్దరు స్టూడెంట్స్ హాస్టల్ బిల్డింగ్ పై గంజాయి సేవిస్తూ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు పట్టుబడగా.. ఈ ఘటనపై ఐదుగురితో కూడిన డిస్ప్లేనరి కమిటీని ఏర్పాటు చేసినట్టు VC వెంకటరమణ తెలిపారు. డైరెక్టర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీప్ వార్డెన్, ADSW, ఫ్యాకల్టీ ఎడ్ ఈ కమిటీలో సభ్యులుగా నియమించినట్టు వీసీ తెలిపారు. నిజనిర్ధారణ చేసి నివేదికను నాలుగు రోజుల వ్యవదిలో అందచేయాలని కోరినట్టు VC వెంకటరమణ తెలిపారు. గత ఏడాది 20(B)II NDPS A యాక్ట్ కింద ఇద్దరు విద్యార్థులపై కేసు కూడా నమోదు చేశామని.. వారి వద్ద నుండి 100 గ్రాములకు పైగా గంజాయిని అప్పట్లో సీజ్ చేసినట్టు తెలిపారు. తాజా ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతామని విద్యార్థుల భవిష్యత్ ను కాపాడుతామని హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…