తెలంగాణ రాష్ట్రంలో జరిగే పెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి. ఈ జాతర ములుగు జిల్లాలోని మేడారం ప్రాంతంలో జరుగుతుంది. ఈ జాతరకు మూల మూల ప్రాంత వాసులు తరలివెళ్తూంటారు. కాగా మేడారం జాతర వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమై.. 8వ తేదీ వరకు జరగనుంది. మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మలను అతిపెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తరించిపోతూంటారు. ప్రస్తుతం ఈ జాతరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ జాతరకు తెలంగాణ ప్రత్యేకంగా 4 వేల బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి ఈ బస్సులు నడుస్తాయని వారు వెల్లడించారు. ఈ సారి 4 వేల బస్సులతో దాదాపు 23 లక్షల మంది భక్తులను మేడారం చేరవేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కాగా.. మేడారం జాతరకు ఆర్టీసీ నుంచి మొత్తం 12,500 మంది ఉద్యోగులు విధుల్లో ఉండనున్నారని.. అంతేకాకుండా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని వారు పేర్కొన్నారు. ఈ జాతరలో ప్రత్యేకంగా సీసీటీవీ ఫుటేజీని ఏర్పాట్లు చేసి పర్యావేక్షిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.