RTC MD Sajjanar: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ (Sajjanar) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కుని చూపిస్తున్నారు. ఆర్టీసి ఉన్నత కోసం వినూత్న నిర్ణయాలతో ముందుకు వెళ్ళడమే కాదు.. ప్రయాణీకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ.. తనదైన శైలిలో వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాజాగా అర్ధరాత్రి (TSRTC) కి ఓ యువతి చేసిన ట్వీట్ పై వెంటనే RTC MD సజ్జనార్ స్పందించారు. అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని కోరిన యువతి పాలే నిషా కోరారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి చెప్పారు.
ఆ యువతి అభ్యర్ధనకు వెంటనే ఎండి సజ్జనార్ (Sajjanar) ట్వీట్ కి స్పందించారు. ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు రీట్వీట్ చేశారు సజ్జనార్. అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ నిషా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఉన్నతి కోసం వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో అంతే చురుగ్గా ఉంటూ..ఆర్టీసీ ఉన్నతికోసం ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఆదాయం పెంచడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించారు. సంక్రాంతికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు కూడా ఎలాంటి అనదపు ఛార్జీలు వసూలు చేయకుండా అందరూ టీఎస్ ఆర్టీసీ వైపు చూసేలా చర్యలు తీసుకున్నారు సజ్జనార్.
@tsrtcmdoffice మహిళలు రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు @tsrtc యాజమాన్యం. స్త్రీ లఅవసరాల నిమిత్తం పెట్రోల్ బంక్స్ లల్లో ఒక పది నిమిషాలు ఆపితే మహిళలకు ఎంతో. సౌకర్యవంతంగా ఉంటుంది ( అవసరాలు బయటికి చెప్పలేరు కాబట్టి )ఈ నిర్ణయం వల్ల గౌర్నమెంట్ కి కూడా ఎటువంటి భారం ఉండదు???
— Pale Nisha (@NishaPale) January 11, 2022
Also Read: దక్షిణ భారత దేశంలో సంక్రాంతి పెద్ద పండగ.. ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారంటే..