TSRTC: ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగులకు రూ.1.12 కోట్ల బీమా.. యూబీఐతో ఆర్టీసీ ఒప్పందం

|

Jan 20, 2024 | 6:18 PM

తమ ఉద్యోగుల టీఎస్‌ఆర్‌టీసీ ఒప్పందం చేసుకుంది. ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది.

TSRTC: ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగులకు రూ.1.12 కోట్ల బీమా.. యూబీఐతో ఆర్టీసీ ఒప్పందం
Tsrtc Mou With Ubi
Follow us on

తమ ఉద్యోగుల టీఎస్‌ఆర్‌టీసీ ఒప్పందం చేసుకుంది. ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్‌లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అకాల మరణం చెందినా, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. దీన్నంతటిని యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. అలాగే రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. అయితే ఇందు కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు ఆర్టీసీ సంస్థ అందించనుంది. పెరిగిన ప్రమాద భీమా ఫిబ్రవరి 1 వ తేది నుంచి అమల్లోకి రానుంది.

ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామన్నారు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనర్. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్యత‌నిస్తున్నట్లు సజ్జనార్ గుర్తు చేశారు.

ఇదిలావుంటే, గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారు. ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుంది. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుంది. సిబ్బంది, ఉద్యోగుల శాల‌రీ అకౌంట్స్‌ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌక‌ర్యం లభిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…