Sankranti Special Buses: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికులు ఇప్పటినుంచే సొంతుళ్లకు పయనమవుతున్నారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. పండగకు 10 రోజులు సమయం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని బస్సులను ప్రాంతాలకు సిద్దం చేశారు. ఇప్పటికే రాష్ట ప్రభుత్వం సెలవులను ప్రకటించబడంతో పల్లెలకు వెళ్లేందుకు పట్నం వాసులు సిద్ధమవుతున్నారు. తెలుగు వారికి అతి పెద్ద పండగ కావడంతో ప్రజలు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడుతున్నారు.ఇక సోంతుళ్లకు వెళ్లే వారితో నగరంలో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి ప్రత్యేకంగా 6,970 బస్సులు నడపనుంది. ఇందులో సంక్రాంతికి ముందుగా 4,145 బస్సులు, పండుగ తరువాత 2,825 బస్సులు తిరగనున్నాయి. జనవరి 8 నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్నాయి. స్పెషల్ బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు 1500 బస్సుల్ని ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది.
మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉండనుంది. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం ఏ విధమైన అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు. కాగా.. తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎలెందర్, టీవీ9 తెలుగు రిపోర్టర్
Also Read: