TSRTC: పది పాస్ అయ్యారా? మంచి అవకాశం కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ.. అదేంటంటే..
నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలని అనుకునే నిరుద్యుగులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి జీవితంలో స్థిరపడెందుకు అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వరంగల్ జిల్లాలోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజ్‌లో వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన కోర్సుల్లో..
నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలని అనుకునే నిరుద్యుగులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి జీవితంలో స్థిరపడెందుకు అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వరంగల్ జిల్లాలోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజ్‌లో వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశాలకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
వరంగల్‌లోని TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్ కోర్స్ ప్రవేశాలకు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31. మోటార్ వెహికిల్ మెకానిక్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలకు అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థలంతా అప్లై చేసుకోవాలని సూచించారు ఆర్టీసీ అధికారులు. రెండు సంవత్సరాల కోర్స్ డ్యూరేషన్‌తో 10th, 8th క్వాలిఫికేషన్‌తో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సొంతంగా ఎదగాలని, లైఫ్‌లో సెట్ అవ్వాలని కలలు కనే వారికి, స్వయం ఉపాధి రంగంలో స్థిరపడెందుకు ఈ ఐటీఐ కోర్సులు మంచి అవకాశం అని చెప్పొచ్చు. వరంగల్ ఐటీఐ కాలేజ్‌లో నిరుద్యోగ యువతకు మంచి శిక్షణ ఇచ్చి లైఫ్‌లో సెట్ అయ్యే విధంగా ఈ ట్రైనింగ్ ఉంటుందని అధికారులు అంటున్నారు. యువతకు బంగారు భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో ఏర్పాటయిన ఈ ఐటీఐ కళాశాలను TSRTC సంస్థ వరంగల్‌లో ఏర్పాటు చేసింది.
నిపుణులైన అధ్యాపకులతో పాటు అనుభవంగల ఆర్టీసీ అధికారులచే క్లాసెస్ నిర్వహించి.. మంచి ట్రైనింగ్‌తో పాటు విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అధికారులు అంటున్నారు. కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్ లోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కాలేజ్ ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 కు సంప్రదించొచ్చు.
వరంగల్‌లోని #TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల ౩1 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగంలో… pic.twitter.com/JjOooikIlR
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 23, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..