TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక..

నోటిఫికేషన్‌లో భాగంగా తార్నాకలోని నర్సింగ్ కళాశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్ -01, అసిస్టెంట్ ప్రొఫెసర్ -03, ట్యూటర్ - 02 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంఎస్సీ నర్సింగ్ చేయటంతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు...

TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక..
TSRTC JOBS

Updated on: Feb 29, 2024 | 7:19 PM

తెలంగాణ ఆర్టీసీ ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని పలు డీపోల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో భాగంగా తార్నాకలోని నర్సింగ్ కళాశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్ -01, అసిస్టెంట్ ప్రొఫెసర్ -03, ట్యూటర్ – 02 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంఎస్సీ నర్సింగ్ చేయటంతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు అందిస్తారు. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూను మార్చి 04, 2024 తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు. తార్నాకలోని టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. అలాగే సందేహాల కోసం 7075009463, 8885027780 ఫోన్‌ నంబర్లను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..