TSRTC Bumper Offers: మాతృమూర్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్‌.. ఏసీ బస్సులతో సహా అన్నింట్లోనూ ఉచిత ప్రయాణం..!

| Edited By: Janardhan Veluru

May 07, 2022 | 11:10 AM

TSRTC Bumper Offers: మహిళకు.. ప్రత్యేకంగా అమ్మలకు తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫరిచ్చింది. మదర్స్ డే ను పురస్కరించుకుని ప్రత్యేక..

TSRTC Bumper Offers: మాతృమూర్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్‌.. ఏసీ బస్సులతో సహా అన్నింట్లోనూ ఉచిత ప్రయాణం..!
Tsrtc
Follow us on

TSRTC Bumper Offers: మహిళకు.. ప్రత్యేకంగా అమ్మలకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫరిచ్చింది. మదర్స్ డే ను పురస్కరించుకుని మాతృమూర్తులకు ప్రత్యేక సదుపాయం కల్పించారు. ఆర్టీసీ ప్రకటించిన ఈ ఆఫర్‌పై మాతృమూర్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనస్సులను గెలుచుకుంటోంది. ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటించిన.. టీఎస్‌ఆర్టీసీ మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. మాతృమూర్తులకు ఆదివారం(మే 8 తేదీన) ఆర్టీసీ బస్సుల్లో రోజంతా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 8న మదర్స్‌ డేను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలిపారు సజ్జనార్‌. ఇప్పటికే మార్చి 8న ఉమెన్స్‌డే సందర్భంగా మహిళలందరికీ రోజంతా బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించిన ఆర్టీసీ.. ఈసారి అమ్మల కోసం ప్రత్యేక ఆఫర్‌ ఇచ్చింది.

టీఎస్‌ఆర్టీసీకి సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆఫర్‌ ఒక్కరోజు మాత్రమే ఉంటుందని తెలిపారు అధికారులు. ఆ బస్సు.. ఈ బస్సు అన్నతేడా లేకుండా ఏసీ బస్సులతో సహా ఏ బస్సులోనైనా మాతృమూర్తులు ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రకటించిన ఆఫర్‌పై అమ్మలు హర్షం ప్రకటిస్తున్నారు. మాతృమూర్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి. అమ్మలకు ఈ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా మదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. అమ్మల త్యాగాలు, సేవలకు గుర్తింపుగా ఈ సదుపాయం కల్పించినట్లు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

Also Read..

Pawan Hans: తీవ్ర నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ సంస్థ ప్రైవేటు చేతుల్లోకి.. అమ్మకానికి కేంద్ర సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’కు ఏపీ సర్కారు గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ..