TSRJC CET 2023: మే 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష.. హాల్‌ టికెట్లు నేరుగా ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి మే 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ పరీక్ష మే 6వ తేదీన జరగనుంది..

TSRJC CET 2023: మే 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష.. హాల్‌ టికెట్లు నేరుగా ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
TSRJC CET 2023

Updated on: May 02, 2023 | 12:36 PM

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి మే 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ పరీక్ష మే 6వ తేదీన జరగనుంది. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష-2023 మే 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ ప్రకటించారు. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని 35 జూనియర్‌ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు కల్పిస్తామన్నారు.

ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను కూడా ఇప్పటికే విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు క్యాండిడెట్‌ ఐడీ/రిఫరెన్స్‌ ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయడం చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.