TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో కొత్త ట్విస్ట్.. రేవంత్‌పై కేసు పెట్టే యోచనలో సిట్..

TSPSC : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో మరో మలుపు తిరిగింది. విచారణ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. సిట్‌ విచారణకు హాజరైన రేవంత్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని భావిస్తోంది సిట్‌. ఆయన విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారంటున్నారు పోలీసులు.

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో కొత్త ట్విస్ట్.. రేవంత్‌పై కేసు పెట్టే యోచనలో సిట్..
Revanth Reddy

Updated on: Mar 23, 2023 | 5:25 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో మరో మలుపు తిరిగింది. విచారణ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. సిట్‌ విచారణకు హాజరైన రేవంత్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని భావిస్తోంది సిట్‌. ఆయన విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారంటున్నారు పోలీసులు. రేవంత్‌పై కేసు నమోదు విషయంలో న్యాయసలహా కోరింది సిట్. పేపర్‌ లీక్‌పై రేవంత్‌రెడ్డి తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని తెలిపింది సిట్‌. నిరాధార ఆరోపణలు చేశారన్న కోణంతో ఆయనపై చర్యలకు సిద్దమవుతున్నారు.

గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌లో ఒకే మండలంలో 100 మందికి 100 మార్కులు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్‌. దీనిపై ఆధారాలు చూపించాలని సిట్‌ ఆయనకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరైన రేవంత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేపర్‌లీక్‌పై సిట్‌ విచారణకు హాజరయ్యారు రేవంత్‌రెడ్డి. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు ఇచ్చినట్టు తెలిపారు. పేపర్‌ లీక్‌పై మాట్లాడిన మంత్రి కేటీఆర్‌కు కూడా సిట్‌ నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు రేవంత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us