TSPSC: టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన..! రద్దైన పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల..

TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త తేదీలు విడుదల చేయబడ్డాయి. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పుల కోసం క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాల్సిందిగా అభ్యర్థులందరికీ కమిషన్ సూచించింది.

TSPSC: టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన..! రద్దైన పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల..
TSPSC

Updated on: Jul 20, 2023 | 8:48 PM

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2023లో జరగనున్న వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం కొత్త పరీక్ష తేదీలను విడుదల చేసింది. గతంలో పేపర్ లీక్ కారణంతో గత మార్చి 5న పరీక్షలు రద్దైన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు వాయిదా వేసిన వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం TSPSC ఇప్పుడు కొత్త పరీక్ష తేదీలను విడుదల చేసింది.

ఇందులో భాగంగా ఏఈ తో పాటు మున్సిపల్ ఏఈ, అలాగే.. టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ అధికారి పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. టీఎస్పీఎస్సీ. అక్టోబర్ 28,19న సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష, 20న మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరీక్ష జరగనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పలు ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం సెప్టెంబర్ 12న నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది.

TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త తేదీలు విడుదల చేయబడ్డాయి. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పుల కోసం క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాల్సిందిగా అభ్యర్థులందరికీ కమిషన్ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..