
TSPSC Group 1 Mains Exam Date 2023: తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11 (ఆదివారం) ప్రశాంతంగా ముగిసింది. రద్దైరన పరీక్షతో పోల్చితే ఈసారి 50 వేల మంది తగ్గినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. పలువురు గ్రూప్-2, 4 పరీక్షలకు సన్నద్ధమవుతుండటంతో పోటీ తగ్గినట్లు తెలుస్తోంది. పరీక్షకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని త్వరలోనే వెబ్‌సైట్లో పొందుపరిచేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. తుది కీ విడుదల అనంతరం మూల్యాంకనం నిర్వహించి నెల రోజుల్లోగా ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. మెయిన్స్ పరీక్షలకు మూడు నెలల సమయమిచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సెప్టెంబరు నెలాఖరు వరకు పలు పోటీ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరులో గ్రూపు-1 మెయిన్స్ నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు.. రద్దయిన గత పరీక్షతో పోల్చితే దాదాపు 50 వేల మంది వరకు తగ్గారు.
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఎవరైనా గ్రూప్ 1 పరీక్షకు హాజరైనట్లయితే వారందరితో నిర్భంద సులవులు పెట్టించారు. పరీక్ష తేదీకి రెండు నెలల ముందు, పరీక్ష తరువాత నెల రోజుల వరకు ఉద్యోగాలకు సెలవు పెట్టించారు. గ్రూప్-1 పునఃపరీక్షకు పది మంది ఉద్యోగులు దరఖాస్తు చేయగా వారందరితో సెలవులు పెట్టించారు. దీంతో నిర్బంధ సెలవులోకి సిబ్బంది వెళ్లడంతో ఇతర ఉద్యోగులు అదనపు గంటలు పనిచేస్తున్నారు. ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.