Bank Jobs: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 445 ఉద్యోగాలు.. లోకల్ అభ్యర్ధులే అర్హులు!
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB) ఆధ్వర్యంలో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (DCCB) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
TSCAB Recruitment 2022: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB) ఆధ్వర్యంలో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (DCCB) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 445
పోస్టుల వివరాలు:
- స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు: 372
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 73
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్:
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.26,080ల నుంచి రూ.57,860ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.17,900ల నుంచి 47,920ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోకల్ అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలమ్స్, మెయిన్స్) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు రూ. 900
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూసీ అభ్యర్ధులకు రూ. 250
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 6, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: