TS Traffic Challans: వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Telangana Traffic police) అమలు చేస్తున్న రాయితీ ఐడియాకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్‌తో చలాన్లను(Challans) క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారు. చలాన్లు కట్టేందుకు వాహనదారులు భారీగా రావడంతో.. సర్వర్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో సర్వర్ లో సాంకేతిక సమస్యలు(Technical Problems in Survers) తలెత్తి, సేవలు నిలిచిపోయాయి. ఆఫర్ ప్రారంభమైన నాటి నుంచి వెబ్ సైట్ ద్వారా రుసుములు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతం సర్వర్ల సామర్థ్యం పెంచారు. ఆఫర్ ప్రారంభమైన సమయం నుంచి వెబ్ సైట్ ద్వారా రుసుములు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. చలాన్ల చెల్లింపు అమల్లోకి వచ్చిన తొలి 8 గంటల్లోనే లక్షా 77వేల చలానాలను వాహనదారులు క్లియర్ చేయడంతో ఈ పోలీసులు పెట్టిన ఆఫర్లకు భారీ స్పందన వచ్చినట్లు తెలిసిపోతుంది. వీటి ద్వారా కోటి 77లక్షల రూపాయలు వచ్చాయి. నిన్న సాయంత్రానికి 5 లక్షల చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. చలాన్ల విలువ 20 కోట్లు అంటే రాయితీ పోనూ.. 5 కోట్ల రూపాయలు వసూలయ్యాయని వెల్లడించారు.
కాగా, ఈ సదుపాయం మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వెబ్‌సైట్‌లోనూ ఈ విషయాన్ని పొందుపర్చారు. వాహనదారులు తమ చలానాలను ట్రాఫిక్ ఈ-చలానా వెబ్‌సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్, నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెల్లించవచ్చు. సాంకేతిక సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేశారు.
► హైదరాబాద్‌లో మొత్తం పెండింగ్ చలానాలు కోటీ 70 లక్షలు
► రాచకొండ, సైబరాబాద్ లిమిట్స్‌లోనే 600 కోట్ల విలువైన చలానాలు
► మొత్తం తెలంగాణలో 1000కోట్ల విలువైన పెండింగ్ చలానాలు
► తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న 60 వేలమంది పోలీసులకు సగటున చెల్లిస్తున్న జీతాలు 200 కోట్లు.
(హై అండ్ లో శాలరీస్ యావరేజ్ తీస్తే సగటున 35వేల చొప్పున)
► రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెయ్యి కోట్ల చలానాల్లో ప్రభుత్వం ఎంత రావచ్చని అంచనా వేస్తోంది. రూ. 200 కోట్ల వరకు రావచ్చన్న అంచనా నిజమే అయితే.. ఒక నెల జీతాల ఖర్చు కలిసివచ్చినట్లవుతుంది.
ఇవి కూడా చదవండి: