TS 10th Paper Leak Case: కట్టుదిట్టమైన భద్రతలో నేడు పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష..! ఎలా జరుగుతుందో..?

|

Apr 06, 2023 | 7:09 AM

తెలంగాణలో పదో తరగతి పరీక్ష పత్రాలు వరుస లీకేజీల వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ పేపర్ల లీకేజీల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికి పోయాయి. ఐతే ఇది లీక్ కాదు, మాల్‌ ప్రాక్టీస్‌ అంటూ అధికారులంటున్నారు. అసలు పేపర్లు బయటకు ఎలా వస్తున్నాయో..

TS 10th Paper Leak Case: కట్టుదిట్టమైన భద్రతలో నేడు పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష..! ఎలా జరుగుతుందో..?
TS 10th Paper Leak Case
Follow us on

తెలంగాణలో పదో తరగతి పరీక్ష పత్రాలు వరుస లీకేజీల వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ పేపర్ల లీకేజీల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికి పోయాయి. ఐతే ఇది లీక్ కాదు, మాల్‌ ప్రాక్టీస్‌ అంటూ అధికారులంటున్నారు. అసలు పేపర్లు బయటకు ఎలా వస్తున్నాయో మాత్రం మిస్టరీగా మారింది. అటు పలు రాజకీయ పార్టీల మధ్య నిందోపనిందలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరగనుంది. ఇప్పటికే వరసగా రెండు పేపర్లు బయటికి రావడంతో ఇవాళ భద్రత మరింత కట్టుదిట్టం చేస్తోంది విద్యాశాఖ. ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించింది. పోలీసులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని కూడా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. భారీగా అదనపు సిబ్బంది నియామకంతో అన్ని కేంద్రాల్లో నిఘా నీడలో గురువారం ఇంగ్లిష్‌ పరీక్ష జరగనుంది.

పరీక్షా కేంద్రంలోకి ఏ ఒక్కరి మొబైల్ అనుమతించకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసే విధంగా చర్యలు చేపట్టారు. అరగంటకొసారి పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితి ఉన్నతాధికారులకు చెరవేసేందుకు కార్యచరణ రూపొందించడం జరిగింది. క్రిమినల్ కేసులు ఉన్న ఇన్విజిలేటర్‌లను విధుల నుంచి విద్యా శాఖ తొలగించింది. ఈ మేరకు కట్టుదిట్టంగా నేడు పరీక్ష నిర్వహణకు ఏర్పాటు షురూ చేశారు. మునుపటి మాదిరిగానే ఈ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీకవుతుందో లేక అక్రమాలకు అడ్డుకట్ట వేసి పకడ్భందీగా పరీక్షను నిర్వహిస్తుందో వేచి చూడవల్సిందే. కాగా తెలంగాణలో సోమవారం (ఏప్రిల్‌ 3) నుంచి పదో తరగతి పబ్లిక పరీక్షలు-2023 ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.