తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ(వాణిజ్య పన్నులు, ఎక్సైజ్) పౌరసరఫరాలు, రవాణా, ఎనర్జీ, హోం, పురపాలక, కార్మిక, ఉపాది శిక్షణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, రెన్యూవల్స్, తనిఖీ లు, రికార్డులు, రిపోర్ట్స్ తదితర అంశాలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలలో భారం తగ్గించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆయా శాఖలపై ఆర్థికభారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన DPIIT ( Dept for Promotion of Industry and Internal Trade) పంపిన అంశాలపై చేపట్టిన చర్యలను శాఖల వారీగా సమీక్షించారు. వినియోగదారుని దృక్పధంలో ఆలోచించి, సాధ్యమైనంత మేరకు వ్యక్తిగత పరిశీలనను తగ్గించుటకు, ఆన్ లైన్ ప్రక్రియను అనుసరించుటకు ఆర్థికభారాన్ని తగ్గించాలని ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా ఇతర శాఖలలో ఉన్న సంక్లిష్ట నిబంధనలను పరిశీలించి, సులభతరం చేయుటకు ఆర్థిక భారాం తగ్గించే కార్యాచరణకై విధి విధానాలను రూపొందించి, సర్కులేట్ చేయాలని ఐ టి, పరిశ్రమలు శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రవి గుప్తా, పౌరసరఫరాల శాఖ E.O. కార్యదర్శి శ్రీ అనీల్ కుమార్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్, CT, నీతూ కుమారి ప్రసాద్, కార్మిక శాఖ కార్యదర్శి శ్రీ అహ్మద్ నదీమ్, ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు, CDMA శ్రీ సత్యనారాయణ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.