Minister KTR: పార్టీ నేతలతో సంచలన కామెంట్స్ చేసిన కేటీఆర్.. 18వ తేదీనే ఆ ప్రకటన అంటూ..

|

Jun 11, 2022 | 9:20 PM

Minister KTR: ఖమ్మం జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.

Minister KTR: పార్టీ నేతలతో సంచలన కామెంట్స్ చేసిన కేటీఆర్.. 18వ తేదీనే ఆ ప్రకటన అంటూ..
Follow us on

Minister KTR: భారత్ రాష్ట్ర సమితి నిన్నటి నుంచి తెలంగాణలో బాగా వినిపిస్తున్న పేరు. టీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పేరు ఇది. నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన దగ్గర నుంచి.. నేషనల్ పాలిటిక్స్ వైపు స్పీడ్ పెంచారు. అయితే ఈరోజు ఖమ్మం పర్యటనలో ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్‌. ఈ సమావేశంలో సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ నెల 18 లేక 19న జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. 18లోపే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో జాతీయ పార్టీ గురించి క్లారిటీ ఇస్తామని స్పష్టం చేశారు, టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్.

జాతీయ పార్టీ విషయం అలా ఉంటే, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు, మంత్రి కేటీఆర్. పీకే రిపోర్ట్ ప్రకారం టీఆర్‌ఎస్‌ హవా తగ్గలేదని వివరించారు. అటు, టికెట్లపై సిట్టింగ్‌లు ఆశలు పెట్టుకోవద్దని, మార్పులు కచ్చితంగా ఉంటాయని ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్. తుమ్మల, పొంగులేటి లాంటి సీనియర్ల అవసరం పార్టీకి ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్.

కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనతో ప్రత్యర్థుల్లో వణుకు పుడుతోందన్నారు మంత్రి ఎర్రబెల్లి. జాతీయరాజకీయాల్లో సీఎం చక్రం తిప్పడం ఖాయమన్నారాయన.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..