CM KCR Birthday: పండుగలా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. అట్టహాసంగా ఏర్పాట్లు..

|

Feb 16, 2022 | 7:54 AM

Telangana CM KCR Birthday Celebrations: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్ రావు (KCR) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

CM KCR Birthday: పండుగలా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. అట్టహాసంగా ఏర్పాట్లు..
Follow us on

Telangana CM KCR Birthday Celebrations: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్ రావు (KCR) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా భిన్నంగా మూడురోజుల పాటు సీఎం కేసీఆర్‌ జన్మదిన సంబరాలు జరపాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ (KTR) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందు కోసం కార్యాచరణ సిద్దం చేశారు. ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర ప్రథమ సీఎం కేసీఆర్ జన్మదినం (CM KCR Birthday) పురస్కరించుకుని సంబరాలను ఘనంగా నిర్వహించుకుందామంటూ మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాల కార్యాచరణను సిద్దం చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్న దశలో సీఎం కేసీఆర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలను పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ విడుదల చేశారు.

ఫిబ్రవరి 15వ తేదీ- రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం (16 తేదీన) అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు కేటీఆర్‌. ఇందులో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొని రక్తదానంలో పాల్గొనాలని కోరారు. ఇక 17 తేదీ కెసిఆర్ జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కార్యకర్తలకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

మొత్తానికి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్దం ప్రకటించి దూకుడు పెంచిన కేసీఆర్‌ ఇప్పటికే పవర్‌ సెంటర్‌గా మారారు. ఈ క్రమంలో మూడు రోజులపాటు నిర్వహించే పుట్టిన రోజు వేడుకలు ఆసక్తిగా మారాయి.

Also Read:

Kcr vs Central Govt: తెలంగాణలో హీటెక్కిన కరెంటు మీటర్ల రాజకీయం.. సీఎం కేసీఆర్‌కు కేంద్రం కౌంటర్‌

Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం నేడే.. భక్తులతో కిటకిటలాడుతున్న వనం..