TRS vs BJP: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది అధికార టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు చేపట్టనుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేశారు గులాబీ దళపతి. మొత్తం మూడు లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొననున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ గురువారం నాడు బీజేపీ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది.
కాగా, కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు సక్సెస్ అయ్యేలా ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టిఆర్ఎస్ నేతల ఉమ్మడి ధర్నా చేపట్టనున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా జిల్లాల ప్రధాన కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు కార్యకర్తలు, నాయకులు రైతుల ధర్నాలో పాల్గొంటారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి ధర్నాలకు సంబంధించి ముందే అనుమతి తీసుకున్నారు టిఆర్ఎస్ నేతలు. పంజాబ్ రాష్ట్రంలో పూర్తి వరి ధాన్యం కొంటున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో ఎందుకు కోనడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
కాగా, అధికార పార్టీ నిరసన నేపథ్యంలో పోలీస్ యాంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు.
Also read:
Tiger – Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మ్యాన్ ఈటర్ కలకలం.. అలర్ట్ ప్రకటించిన అధికారులు..