TRS Party: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం.. రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేత.. తెలంగాణ భవన్‌లో ‘గన్‌’తో హల్‌చల్..

|

Mar 21, 2021 | 12:01 PM

TRS Party: తాజాగా రాష్ట్రంలో వెలువడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు బంపర్ మెజార్టీతో గెలుపొందడంతో..

TRS Party: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం.. రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేత.. తెలంగాణ భవన్‌లో ‘గన్‌’తో హల్‌చల్..
Trs Party Leader
Follow us on

TRS Party: తాజాగా రాష్ట్రంలో వెలువడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు బంపర్ మెజార్టీతో గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నాయి. రంగులు చల్లుకుని, బాణా సంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. అయితే, ఈ సంబరాల్లో టీఆర్ఎస్ పార్టీ నేత కట్టెల శ్రీనివాస్ అతి చేశారు. ఆయన చేసిన అతి పార్టీకి ఇబ్బందిగా పరిణమించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందుగా హైదరాబాద్-రంగారెడ్డి-మహమూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ దేవి గెలుపొందారు. ఆ తరువాత మరికాసేపటికే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

వీరిద్దరి గెలుపును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యాలయం అయిన టీఆర్ఎస్ భవన్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, ఈ సంబరాల సందర్భంగా టీఆర్ఎస్ కట్టెల శ్రీనివాస్ తన గన్‌తో హల్‌చల్ చేశాడు. శ్రీనివాస్‌ గన్‌ను చేతబట్టి పార్టీ సంబరాల్లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరి విషయం కాస్తా పార్టీ పెద్దల వరకు వెళ్లింది. కట్టెల శ్రీనివాస్ తీరుపై పార్టీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Also read:

MGM Hospital: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం.. ఆగిన విద్యుత్ సరఫరా.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పేషెంట్..

Detel Easy Plus Launched: ప్రపంచంలో అతి చౌకైన ఎలక్ట్రిక్‌ స్కూటర్ రిలీజ్.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో..