Telangana: ఎవరితో శత్రుత్వం లేదు.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.. కేంద్రానికి స్పష్టం చేసిన టీఆర్ఎస్..

|

Jul 18, 2021 | 8:47 PM

Telangana: ఎవరితోనూ శత్రుత్వం లేదు అంటూనే.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని కేంద్ర ప్రభుత్వానికి..

Telangana: ఎవరితో శత్రుత్వం లేదు.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.. కేంద్రానికి స్పష్టం చేసిన టీఆర్ఎస్..
Mp Nama
Follow us on

Telangana: ఎవరితోనూ శత్రుత్వం లేదు అంటూనే.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. ఆదివారం నాడు ఢిల్లీలో పార్లమెంట్‌లో రెండు వేర్వేరు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్రానికి క్లారిటీ ఇచ్చారు. తొలుత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావుతో పాటు హాజరైన నామ, అనంతరం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి లోక్‌సభాపక్ష నేతగా హాజరయ్యారు.

ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించామన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ విభజన చట్టంలో పొందుపర్చిన అనేక హామీలు పూర్తికాలేదన్నారు. వీటిపై చర్చ చేపట్టేలా అవకాశం కల్పించాలని కోరినట్లు నామా తెలిపారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కల్గించే చర్యలపై కూడా చర్చ జరగాలని నామ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి కూడా పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే ఏ అంశాన్ని తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే.. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని కోరినట్టు తెలిపారు. ఒకే రోజు రెండు-మూడు బిల్లులు ప్రవేశపెట్టి హడావుడిగా సరైన చర్చలేకుండా పాస్ చేయడం మానుకోవాలని సూచించినట్లు తెలిపారు. బిల్లులపై కనీసం 48 గంటల ముందు అన్ని పార్టీలకు సమాచారమివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా మారిందని, ధరల పెరుగుదలతో సామాన్యుడి బ్రతుకు భారంగా మారిందని అన్నారు. వీటితో పాటు ఇతర ప్రజాసమస్యలపై పార్లమెంటులో చర్చించాలని కోరినట్టు తెలిపారు.

Also read:

భారత స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీపై కన్నేసిన హాంగ్ కాంగ్ మొబైల్‌ సంస్థ.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో విడుదల

IND vs SL 1st ODI Live: తొలి హాప్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్.. విజయానికి 136 పరుగులు మాత్రమే

Viral Video: బాలయ్య పాటా మజాకా.. వర్షంలో అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము రేపిన తాత.. చూస్తే ఫిదా అయిపోతారంతే..