TRS on RS Praveen: అందుకే రాజకీయాల్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు!

ఉద్యోగం పోతుందన్న భయంతోనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

TRS on RS Praveen: అందుకే రాజకీయాల్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు!
Trs Mlas Press Meet

Updated on: Aug 09, 2021 | 6:07 PM

TRS MLAs fire on Praveen Kumar: ఉద్యోగం పోతుందన్న భయంతోనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, సైదిరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

రాష్ట్రంలో దళిత జాతి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వాటిల్లో అధికారికంగా పాలు పంచుకున్న ప్రవీణ్‌.. ఇలా విమర్శించడం సిగ్గుచేటని గాదరి కిశోర్ అన్నారు. ఒక్క రూపాయి దళితుల కోసం పనిచేయకుండా, ఇస్తామన్న ఉద్యోగులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉండి.. ఇష్టారీతిగా వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగం ఉంటుందో, పోతుందోనన్న భయాందోళనతో జాతికోసం బయటకు వస్తున్నట్లు నాటకమాడారని ఆయన విమర్శించారు. తనను తానూ రక్షించుకునేందుకు బహుజన్‌ సమాజ్‌పార్టీలో చేరారని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అంటే, ఏమవుతోందనన్న భయం ఆయనలో ఉందని.. ఇది గమనించాలని తెలంగాణ దళిత జాతిని కోరుతున్నానని గాదరి కిశోర్ అన్నారు.

దళిత జాతి బాగుపడుతుంటే వాళ్లను ఆగమాగం చేసి, గందరగోళం చేయాలని చూస్తారని ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. దళితులకు ప్రమోషన్స్‌, ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రయోగిస్తున్న కుట్రలో భాగంగానే ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత బంధులాంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్న నేతలు.. త్వరలోనే మీకు కనువిప్పు కలుగుతుంది.. ఎన్నికలు ఎప్పుడు వచ్చి కారు విజయం తథ్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


Read Also… Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ

Hyderabad ex Mayor: హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయిన మజ్లిస్ నేతలు.. జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్న మాజీ మేయర్..!