Nallala Odelu: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే దంపతులు..!

|

May 19, 2022 | 12:53 PM

Nallala Odelu: కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాలు ఓదేలు కాంగ్రెస్‌..

Nallala Odelu: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే దంపతులు..!
Odelu 1
Follow us on

Nallala Odelu: కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాలు ఓదేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. జడ్పీ ఛైర్మన్ అయిన తన భార్య భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన ఒదేలు.. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ నివాసానికి పయనం అవుతారు. ఇవాళ సాయంత్రం రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో నల్లాల ఒదేలు దంపతులు చేరనున్నారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఒదేలుకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని ఆశపడగా.. ఆ విషయంలోనూ నిరాశే ఎదురైంది. చివరకు తన భార్య నల్లాల భాగ్యలక్ష్మిని జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచిర్యాల జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అయితే, పార్టీలో తమకు సముచిత స్థానం దక్కడం లేదంటూ తీవ్ర అసంతృప్తితో ఉన్న ఒదేలు దంపతులు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు పార్టీని వీడాలని డిసైడ్ అయి.. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. రాహుల్‌ గాంధీతో అపాయింట్‌మెంట్‌ ఖరారైన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.