TRS Flag Day: తెలంగాణ వ్యాప్తంగా గులాబీ గుమగుమలు.. అట్టహాసంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

|

Sep 02, 2021 | 1:38 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఫలితంగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గులాబీ జెండా

TRS Flag Day: తెలంగాణ వ్యాప్తంగా గులాబీ గుమగుమలు.. అట్టహాసంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ
Trs
Follow us on

Telagana – TRS party: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఫలితంగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. టీఆర్‌ఎస్‌ జెండా పండుగ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. పల్లెపల్లెనా, పట్టణాల్లో వార్డు వార్డునా టీఆర్‌ఎస్‌ నేతలు గులాబీ జెండాను ఎగుర వేసి జెండాపండుగను ఘనంగా నిర్వహించారు.

టీఆర్ఎస్ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేసిన అనంతరం మాట్లాడుతూ.. ప్రతీక్షణం ప్రజాహితం కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా పండుగలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి హాజరయ్యారు.

అటు, వరంగల్‌ జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సాహంగా గులాబీ జెండాలను ఆవిష్కరించారు. నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ జెండా జెండాను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు. టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధాని హైదరాబాద్ లోని అన్ని పార్టీ ఆఫీసులతోపాటు, బస్తీల్లోనూ గులాబీ జెండా పండుగ ఘనంగా జరుగుతోంది.

Read also: KCR: ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భూమిపూజలో సీఎం కేసీఆర్.. శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వహిస్తోన్న వేద పండితులు