Corona Virus: కరోనా విషయంలోనూ ప్రత్యేక చాటుకున్న గిరిజనులు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న వైనం

|

Jun 09, 2021 | 11:31 AM

Isolation at Burial Ground : గిరిజనం అంటేనే ప్రత్యేక జీవన విధానం...ప్రత్యేక కట్టుబాట్లు, ఇతరులకు బిన్నంగా సంప్రదాయాలు ఉంటాయి.. అయితే..తాజాగా ఆ విధానాన్నే కరోనాకు..

Corona Virus: కరోనా విషయంలోనూ ప్రత్యేక చాటుకున్న గిరిజనులు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న వైనం
Isolation At Burial Ground
Follow us on

Isolation at Burial Ground : గిరిజనం అంటేనే ప్రత్యేక జీవన విధానం…ప్రత్యేక కట్టుబాట్లు, ఇతరులకు బిన్నంగా సంప్రదాయాలు ఉంటాయి.. అయితే..తాజాగా ఆ విధానాన్నే కరోనాకు కూడా అప్లై చేశారు తెలంగాణ గిరిజనం. గ్రామానికి చెందిన 50మందికి కరోనా సోకడంతో ఏకంగా స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్నారు..అధికారులు వద్దని వారించినా..వారికి అక్కడే స్వేఛ్చగా ఉందంటున్నారు.

దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా గిరిజనుల సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇతరులకంటే భిన్నంగా ఉంటాయి. ఆధునికంగా సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా ఇంకా గిరిజనుల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ అడవి బిడ్డలు తినే తిండి నుంచి చేసే పనుల వరకూ తమ మార్క్ ఉండేలా ప్రత్యేకాను చాటుకుంటారు. అయితే ఈ విధానాన్ని కరోనా కూడా గిరిజనులు అప్లై చేశారు. తమ గ్రామంలోని కొంతమందికి కరోనా సోకడంతో.. స్మశానం బాట పట్టారు. రుద్రభూమిని ఐసోలేషన్ సెంటర్ గా మార్చుకున్నారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మండలంలోని మొద్దులమడ అనే గిరిజన గ్రామం ఉంది..ఆ గ్రామంలో మొత్తం 150 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ఇంకా చెప్పాలంటే ఇంటికి ఒక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారు. దీంతో తమ వలన గ్రామంలోని ఇతరులకు కరోనా సోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే వేల ఖర్చు పెట్టి.. ఆస్పత్రిలో చేరే స్తొమత గానీ… ఇతర ప్రాంతాల్లోని ఐసోలేషన్ సెంటర్ కు వెళ్లే అవకాశం గానీ లేదు.. దీంతో తమ గ్రామంలోని రుద్రభూమిని ఆశ్రయించారు కోవిడ్ బాధితులు. గ్రామంలోనే ఉన్న విశాలమైన స్మశానవాటికను ఐసోలేషన్ సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ.. బాధితులందరూ అందరూ కలిసి వంట చేసుకుంటూ తింటున్నారు.

ఈ బాధితులకు మందులనుంచి.. ఆహార పదార్ధాలను.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో పాటు రాజకీయనాయకులు సహాయం చేస్తున్నారు. అయితే ఆనోటా ఈ నోటా ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు చేరింది. అధికారులు వారిని ఐసోలేషన్ సెంటర్ కు తరలించి వైద్యం అందించడానికి చర్యలు మొదలు పెట్టారు.స్మశానం వద్దకు వచ్చి బాధితులను తరలించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే గిరిజనులు మాత్రం ప్రభుత్వ ఐసోలేషన్ లో ఉండడానికి అంగీకరించలేదు. తమకు ఇక్కడే బాగుందని.. స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛ జీవితం ఉందని తెలిపారు. దీంతో అధికారులు చేసేదేమి లేక వెనక్కి తగ్గారు.

Also Read:సీ ఫుడ్ లో బెస్ట్ చేపలు.. వీటిని తినడం వలన శరీరానికి కలిగే మేలు ఏమిటంటే..!