Watch: సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి!

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్‌లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరి కొందరు కార్మికులు గాయపడ్డారని.. వారికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.

Watch: సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి!
Esi Hospital

Updated on: Nov 24, 2025 | 5:19 PM

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్‌లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.  హాస్సిటల్‌ రెనోవేషన్‌ కోసం ఇటీవలే అక్కడ పనులు ప్రారంభించనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్మికులు సెంట్రింగ్‌ వేయగా.. ప్రమాదవశాత్తు అది కూలిపోయింది. దీంతో స్లాబ్‌ పెచ్చులు అక్కడ పని చేస్తున్న కార్మికులపై పడిపోయాయి. దీంతో ముగ్గురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే మరి కొందరు గాయపడ్డారని.. గమనించి సిబ్బంది వెంటనే వారిని హాస్పిటల్‌లోకి తరలించి.. చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే హాస్పిటల్‌ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. కాబట్టి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us