Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..

|

Sep 21, 2021 | 3:39 PM

రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్. TRS చేపట్టిన ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి KTRపై నిరాధార ఆరోపణలు చేస్తున్న రేవంత్‌పై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
Tpcc Chief Revanth Reddy Ho
Follow us on

టాలీవుడ్ డ్రగ్స్ కథ ముగిసింది. ఇప్పుడు పొలిటికల్ డ్రామా మొదలైంది. రేవంత్ వదిలిన వైట్ ఛాలెంజ్ వైల్డ్‌గా మారింది. అటు కాంగ్రెస్ కార్యకర్తలు… ఇటు గులాబీ దళం… దాడులు, ప్రతి దాడులతో హైటెన్షన్ పుట్టిస్తున్నారు. రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్. TRS చేపట్టిన ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి KTRపై నిరాధార ఆరోపణలు చేస్తున్న రేవంత్‌పై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు వీరిని అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే .. కాంగ్రెస్ వాళ్లే తమపై దాడి చేశారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు… ఆందోళనకారుల్ని చెదరగొట్టారు..

మరోవైపు.. తెలంగాణలో వైట్ ఛాలెంజ్ రాజకీయ రచ్చ రేపుతోంది. రేవంత్, కేటీఆర్‌ మధ్య మొదలైన డ్రగ్స్ రగడ… కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ సవాలు విసిరిన రేవంత్‌రెడ్డి… తన నిజాయితీ నిరూపించుకోవాలంటూ గన్‌పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. గన్‌పార్క్ దగ్గర్నుంచి రేవంత్ అలా వెళ్లారో లేదో టీఆర్ఎస్ శుద్ధి ప్రోగ్రామ్ చేపట్టింది. రేవంత్ ధర్నాతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందంటూ గన్‌పార్క్‌ను గోమూత్రంతో కడిగి క్లీన్ చేశారు. ఈరోజు కూడా అమరవీరుల స్థూపాన్ని పాలతో కడిగారు టీఆర్ఎస్ యువజన విభాగం నేతలు.

వైట్ ఛాలెంజ్..

వైట్ ఛాలెంజ్ – గ్రీన్ ఛాలెంజ్ – బ్లాక్ ఛాలెంజ్ – రూపు మారుతోందీ ఛాలెంజ్.. వాడీ వేడిగా కామెంట్ల వర్షం కురుస్తోంది. రేవంత్ రెడ్డి విసిరిన ఈ ఛాలెంజ్ పై ఇప్పటికే టీఆర్ఎస్ రగులుతోంది. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు టీఆర్ఎస్ లీడర్లు. రేవంత్ రెడ్డి ఒక నొటోరియస్ అని.. మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూపంలో కనిపించడానికే ఈ డ్రామా ఆడుతున్నారనీ అంటున్నారు గులాబీ నేతలు. ఆర్టీఐ ద్వారా మీరు చేస్తున్న బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ అందరికీ తెలుసని కొత్తగా వైట్ ఛాలెంజ్ డ్రామా ఆడుతున్నావన్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.