CM KCR: వైరల్‌ ఫీవర్‌ నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్‌.. మూడు వారాల తర్వాత పూర్తి ఆరోగ్యంతో..

|

Oct 13, 2023 | 7:01 AM

సీఎం కేసీఆర్‌ కోలుకున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. కొన్ని రోజుల ముందే ఆయన కోలుకున్నా.. బలహీనత వల్ల బయటకు రాలేదు. కేటీఆర్‌, హరీష్‌ రావుతో సమావేశమైన ఆయన తన క్యాంపేన్‌పై వారితో చర్చించారు. తనకు అనారోగ్యం ఉన్నా.. పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించినట్లు వీరు తెలిపారు. గత నెలలోనే కేసీఆర్‌కు వైరల్‌ ఫీవర్‌ సోకింది.

CM KCR: వైరల్‌ ఫీవర్‌ నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్‌.. మూడు వారాల తర్వాత పూర్తి ఆరోగ్యంతో..
CM KCR With Srinivas Goud
Follow us on

సీఎం కేసీఆర్‌ పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తున్నారు. మూడు వారాలుగా వైరల్‌ ఫీవర్‌ ఆతర్వాత చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడిన ఆయన.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. కొన్ని రోజుల ముందే ఆయన కోలుకున్నా.. బలహీనత వల్ల బయటకు రాలేదు. కేటీఆర్‌, హరీష్‌ రావుతో సమావేశమైన ఆయన తన క్యాంపేన్‌పై వారితో చర్చించారు. తనకు అనారోగ్యం ఉన్నా.. పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించినట్లు వీరు తెలిపారు. గత నెలలోనే కేసీఆర్‌కు వైరల్‌ ఫీవర్‌ సోకింది.

అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ విషయాన్ని కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కాని ఆయన కోలుకుంటున్నట్లు వారికి సమాచారం ఇచ్చారు. అయితే.. వైరల్‌ ఫీవర్‌ కారణంగా సెకండ్‌ గ్రేడ్‌ చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌ కూడా రావడంతో.. ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగింది. మూడు వారాల తర్వాత నిన్న ఆయన పూర్తి ఆరోగ్యంతో కనిపించారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాలమూరు ప్రోగ్రెస్‌రిపోర్ట్‌ను కేసీఆర్‌కు అందించిన సందర్భంగా ఈ ఫొటో తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తల్లి చనిపోవడంతో.. ఈరోజు ఆయన నిజామాబాద్‌ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈనెల 16 నుంచి ఆయన ఎన్నికల క్యాంపేన్‌కు సిద్ధమవుతున్నారు. నవంబర్‌ 9న నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ పోస్టు ఇక్కడ చూడండి..

ఇదిలావుంటే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) విజయాన్ని సాధించేందుకు అన్ని విధాలా పావులు కదుపుతోంది. గత 10 ఏళ్లలో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ఓటర్లతో పార్టీ అభ్యర్థులు కనెక్ట్ అవ్వాలని పట్టుబట్టి పార్టీ నాయకత్వం సమగ్ర ప్రచార వ్యూహాన్ని రూపొందించింది.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు గురువారం 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌ల తొలి జాబితాను విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించడంలో ఇన్‌ఛార్జ్‌లుగా నియమితులైన పార్టీ సీనియర్ నేతలు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి