Holiday Tomorrow: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 22న సెలవు.. అందరికి కాదు.. కొందరికే..!

Holiday Tomorrow: ఫిబ్రవరి 22 శనివారం విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఎందుకంటే వారికి సెలవు ఉండనుంది. మరి రేపు విద్యార్థులకు సెలవు ఎందుకని అనుకుంటున్నారా? అది అందరికి కాదు. కొందరికి మాత్రమే సెలవు ఉండనుంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత విద్యార్థులకు శనివారం సెలవు తీసుకోనున్నారు..?

Holiday Tomorrow: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 22న సెలవు.. అందరికి కాదు.. కొందరికే..!

Updated on: Feb 21, 2025 | 2:41 PM

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు అంటే శనివారం సెలవు ఉండనుంది. అయితే ఇది అందరికి వర్తించదు. కొందరు విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది. ఈ సెలవు కేవలం జేఎన్‌టీయూ విద్యార్థులకు మాత్రమే. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU)-హైదరాబాద్ ప్రతి నెలా నాల్గవ శనివారం సెలవు దినంగా తిరిగి అమలు చేస్తోంది.

గురువారం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జెఎన్‌టియు-హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వరరావు ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అధికారుల ప్రకారం.. ఇకపై ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో విశ్వవిద్యాలయ కార్యాలయాలు, క్యాంపస్, యూనివర్సిటీ కళాశాలలకు సెలవు ఉంటుంది. 2008 వరకు విశ్వవిద్యాలయానికి ప్రతి నాల్గవ శనివారం సెలవు ఉండేది. అయితే, దానిని నిలిపివేశారు. దాదాపుప 16 ఏళ్ల తర్వాత రేపు శనివారం రోజున విద్యార్థులు సెలవు తీసుకోబోతున్నారు. ఇక ప్రతి నెలా 4వ శనివారం రోజున విద్యార్థులకు హాలిడే ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి