Telangana: చప్పుడు కాకుండా పెంచేశారు.. ఆర్టీసీ ప్రయాణీకులపై మరో భారం.. కొత్త ఛార్జీలు ఇలా

|

Apr 01, 2023 | 5:29 PM

టీఎస్ఆర్టీసీ టోల్ సెస్ పేరుతో ప్రయాణికులపై మరో భారం వేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే బాదుడు షురూ చేసింది. పెరిగిన చార్జీలు ఎంతో తెలియన ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.

Telangana: చప్పుడు కాకుండా పెంచేశారు.. ఆర్టీసీ ప్రయాణీకులపై మరో భారం.. కొత్త ఛార్జీలు ఇలా
TSRTC Bus Charges
Follow us on

టోల్ చార్జీల పెంపు పేరుతో ప్రయాణికులపై మరో భారం మోపింది టీఎస్ఆర్టీసీ. బస్సు ప్రయాణించే మార్గాల్లో టోల్ ప్లాజాల సంఖ్యను బట్టి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధరాత్రి నుంచి చార్జీలు పెంచి వసూలు చేస్తుంది. అటు పెరిగిన బస్సు చార్జీలతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

నిన్నటి వరకు హైదరాబాద్ — ఖమ్మం ఎక్స్‌ప్రెస్ బస్సు టికెట్ 270 రూపాయలు ఉంటే.. ఇప్పుడు అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తూ 290 రూపాయలు చేసింది. హైదరాబాద్ — కొత్తగూడెం 347 ఉన్న పాత చార్జీల ప్లేస్ లో కొత్తగా 390 రూపాయలు వసూలు చేస్తుంది. హైదరాబాద్ — సిద్ధిపేట ఎక్స్‌ప్రెస్ బస్సుకు పాత చార్జీ 140 రూపాయలు ఉంటే ఇప్పుడు అధనంగా ఐదు రూపాయలు పెచిందింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..