Dates Liquor Benefits : ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న ఖర్జుర కల్లు.. ఈ కల్లులో ఏముందో తెలుసా..!

|

Feb 22, 2021 | 12:47 PM

తాటి కల్లు, ఈత కల్లు గురించి పక్కన పెట్టి ప్రస్తుతం ఎక్కువుగా ఖర్జూరం కల్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కల్లు ఖర్జురం చెట్ల మీద నుంచి దించకుండానే అడ్వాన్స్ ఇచ్చేటంత డిమాండ్ సొంతం...

Dates Liquor Benefits :   ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న ఖర్జుర కల్లు.. ఈ కల్లులో ఏముందో తెలుసా..!
Follow us on

Dates Liquor Benefits : తాటి కల్లు, ఈత కల్లు గురించి పక్కన పెట్టి ప్రస్తుతం ఎక్కువుగా ఖర్జూరం కల్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కల్లు ఖర్జురం చెట్ల మీద నుంచి దించకుండానే అడ్వాన్స్ ఇచ్చేటంత డిమాండ్ సొంతం చేసుకుంది. ఈ కల్లు కోసం పేద ధనిక, చదువు తో సంబంధం లేకుండా ఎగబడుతున్నారు. లీటర్ రూ. 500 ఖరీదైన సరే సొంతం చేసుకుని తాగడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ ఖర్జూర కల్లు గురించి తెలిసిన వారు ఎవరైనా తాగకుండా ఉండలేరు అంటున్నారు.. మరి ఈ కల్లులో ఏముందో చూద్దాం..!

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా.. కల్వకుర్తి మండలంలో టర్నికల్ అనే గ్రామంలో ఎక్కువ మంది ఖర్జూర కల్లును తాగడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తాటి కల్లు, ఈతకల్లు, ఖర్జుర కల్లు మూడు సహజసిద్ధంగానే లభిస్తాయి. అయితే తాటి, ఈత కల్లు తాగితే మత్తు వస్తుంది. అంతేకాదు విపరీతమైన చెమట పడుతుంది. కొంతమందికి ముఖం కూడా మారుతుంది. ఐతే ఖర్జుర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉండడంతో అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి ఈ కల్లు తాగితే ఎటువంటిసైడ్ ఎఫెక్ట్స్ రావని ఆబ్కారీ అధికారులు అంటున్నారు.

అందుకనే అతిగా మద్యం సేవించేవారు కాకుండా కల్లు తాగాలనుకునేవారు మాత్రమే ఖర్జూర కల్లును సేవిస్తున్నారని అంటున్నారు. ఇక ఉన్నత వర్గానికి చెందిన వారు కొందరు ముందే ఆర్డర్ చేసి మరీ కల్లును తీసుకెళ్తున్నారట. ఇందులో ఆల్కహాల్ 4 నుంచి 6 శాతం ఉంటుందని అబ్కారీ శాఖ అధికారులు చెప్పారు. దానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దానికి వాసన సైతం ఉండదట. మరోవైపు ఖర్జూర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కవే అయినందున ఆరోగ్యానికీ ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. ఖర్జూరంతో ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో… ఆ చెట్టు నుంచి వచ్చే కల్లూ అంతే ఆరోగ్యమని వారు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలో రైతులు ఖర్జుర కల్లు దానిమ్మ తో వైన్ ను తయారు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు.

Also Read:

ఎదురు కాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ.. కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా పేలిన మందుపాతర.. ఓ జవాన్‌కు తీవ్ర గాయాలు

 మెగాస్టార్‌ నుంచి బహుమతి అందుకున్న దేవీ శ్రీ.. ‘ఇది చెప్పడానికి ట్వీట్ సరిపోదంటూ’..