AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్‌ నుంచి బహుమతి అందుకున్న దేవీ శ్రీ.. ‘ఇది చెప్పడానికి ట్వీట్ సరిపోదంటూ’..

Chiranjeevi Surprise Gift To DSP: లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. దీంతో వరుస పెట్టి సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే..

Chiranjeevi: మెగాస్టార్‌ నుంచి బహుమతి అందుకున్న దేవీ శ్రీ.. 'ఇది చెప్పడానికి ట్వీట్ సరిపోదంటూ'..
Narender Vaitla
|

Updated on: Feb 22, 2021 | 12:40 PM

Share

Chiranjeevi Surprise Gift To DSP: లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. దీంతో వరుస పెట్టి సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే ‘ఉప్పెన’ సినిమా. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటించిన ఈ చిత్రం సంచలన విజయ సాధించింది. ఏకంగా రూ.70 ఓట్ల గ్రాస్‌ వసూళు చేసి రికార్డులు తిరగరాసే పనిలో పడింది. ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఈ సినిమాకు దేవీశ్రీ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఈక్రమంలోనే దేవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మెగా స్టార్‌ చిరంజీవి కూడా దేవీ శ్రీ ప్రసాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఓ బహుమతిని కూడా పంపించాడు. బహుమతితో పాటు చిరు ఓ లేఖను పంపాడు. ఆ లేఖలో ఏముందంటే.. `డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ `ఉప్పెన` విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతం ఇస్తావో.. కొత్త వారికి కూడా అంతే ఫ్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేమతో చిరంజీవి` అంటూ చిరు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇక తన అభిమాన హీరో నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ రావడంతో దేవీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న దేవీశ్రీ.. ఓ వీడియోను రూపొందించాడు. ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘చిరు సార్‌ నుంచి అపురూపమైన బహుమతి అందుకున్నాను. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నాకు ట్వీట్ సరిపోదు.. అందుకే వీడియోను రూపొందించాను’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు.

Also Read: Chitram Movie Sequel: ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ.. త్వరలోనే సెట్స్ పైకి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..