Nalgonda: నల్లగొండ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాల్వలు, కుంటలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాల్లో రోడ్లు తెగిపోయాయి. వాగులు పొంగి పొర్లుతుండటంతో.. రోడ్డు మార్గాలు బంధ్ అయ్యాయి. జిల్లాలోని చండూరులో శిర్ధపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే, వాగు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులు.. ఆ ప్రవాహ ఉధృతిలో చిక్కుకుపోయారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో.. పెను ప్రమాదం తప్పింది. యువకులు చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి వచ్చి వారిని కాపాడారు. క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సుంకోజు శ్రీనివాస చారి, ముంజంపల్లి దయనందు, లింగోజు కిరణ్.. ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురూ కలిసి ఒక బైక్‌పై చండూర్‌కు ఓ శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. శిర్ధపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండగా.. ఆ యువకులు వరద ప్రవాహాన్ని దాటేందుకు సాహసించారు. అయితే, వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో వారి బైక్‌తో సహా ఇద్దరు యువకులు ప్రవాహంలో కొంతదూరం కొట్టుకుపోయారు. మరో యువకుడు వడ్డునే నిలిచిపోయాడు. నీటి ఓడ్డున వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అలర్ట్ అయిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకులను.. చండూర్ పోలీసులు తాడు సహాయంతో కాపాడారు. వారిని క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also read:
Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చనిపోయిన గేదెపైకి ఎక్కిన ఆటో..
సంతాన సాఫల్యానికి కొత్త జంటలు ఎందుకు దూరమవుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందా?
Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ