Car Accident: నల్గొండ జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. ఒక బాలుడు ప్రాణాలతో బయట పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ వైపు వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో.. రోడ్డుపక్కనే ఉన్న ఏఎంఆర్‌పీ లింక్ కెనాల్‌లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ యాక్సిడెంట్‌లో దంపతులు ఓర్సు రఘు, అలివేలు, కుమార్తె కీర్తి మృతి చెందారు. మృతులను వడ్డెరిగూడేనికి చెందిన వారిగా గుర్తించారు.
కారు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కాలువలోకి దూకారు. అయితే కారు చాలా లోతుగా మునగడంతో.. ఎంత ప్రయత్నించినా కారు డోర్లు తెరుచుకోలేదు. దాంతో క్రేన్ సహాయంతో కారును బలవంతంగా పైకి లాగారు. దీంతో ఊపిరాడక ముగ్గురు కుటుంబసభ్యులు చనిపోగా.. ఈ ఘటనలో బాలుడిని రక్షించారు స్థానికులు. ఈ కుటుంబం ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read More: పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలో మొదటి కేసు!