Telangana: ఇంకా గృహప్రవేశం కూడా అవ్వని ఇంట్లో దొంగతనం.. ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే మైండ్ బ్లాంక్

| Edited By: Ravi Kiran

Mar 21, 2022 | 5:14 PM

కాదేదీ దొంగతనానికి అనర్హం అంటూ దొంగలు కొత్త భాష్యం చెబుతున్నారు. ఏది కనిపిస్తే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. డబ్బు, బంగారాన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా దాచుకుంటున్న క్రమంలో.. కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు.

Telangana: ఇంకా గృహప్రవేశం కూడా అవ్వని ఇంట్లో దొంగతనం.. ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే మైండ్ బ్లాంక్
Theft In New House
Follow us on

కాదేదీ దొంగతనానికి అనర్హం అంటూ దొంగలు కొత్త భాష్యం చెబుతున్నారు. ఏది కనిపిస్తే అది ఎత్తుకెళ్లిపోతున్నారు. డబ్బు, బంగారాన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా దాచుకుంటున్న క్రమంలో.. కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా వికారాబాద్ జిల్లా( vikarabad district) పరిగి( parigi )మున్సిపల్ పరిధిలోని సాయిరాం కాలనీలో ఓ వింత దొంగతనం వెలుగుచూసింది. ఇంకా గృహప్రవేశం కూడా చేయని ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. వివరాల్లోకి వెళ్తే… కాలనీలో రఘు అనే స్థానికుడు.. గతేడాది కొత్తగా ఇల్లు కట్టారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకం సామాగ్రి వినియోగించడం వల్ల ఇల్లు బీటలు వారింది. దీంతో.. మరోసారి మరమ్మతులు చేయించాలనుకున్నాడు రఘు. ఆ తర్వాతే గృహ ప్రవేశం చేద్దామనుకున్నాడు. అందుకు సంబంధించిన సామాగ్రి అంతా తెప్పించాడు. ఈ క్రమంలో  శనివారం అర్ధరాత్రి దొంగలు ఆ ఇంటి గోడలు దూకారు. ఆ కొత్త ఇల్లు చుట్టుపక్కల మరే ఇల్లు లేకపోవడంతో దర్జాగా పని పూర్తి చేయొచ్చని అనుకున్నారు. కానీ గృహప్రవేశం కూడా కాని ఇంట్లో ఏమి ఉంటాయ్ చెప్పండి. అయినా ఆ దొంగలు నిరాశపడలేదు. ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లిపోవడానికి మనసు అంగీకరించలేదు. అంతే వెంటనే క్రేజీ ఐడియాతో చెలరేగిపోయారు. ఇంటి వెనకాల 430 ఫీట్లల్లో ఉన్న బోరు మోటారును పైకి లాగి బోరు, పైపును అంతా ముక్కలుముక్కలుగా కోసివేశారు. బోరు మోటారు, వైరు తీసుకుని పక్కకుపెట్టారు. లోపలికి వెళ్లి నల్లాలు, మిగిలిపోయిన టైల్స్, పెయింట్​, బాత్​రూమ్​లో షవర్​, గ్రీజర్,మ్యాన్ హోల్​ మూతలు, ప్లంబరుకు సంబంధించిన అన్ని వస్తువులు సర్దుకుని ఉడాయించారు. తెల్లారాక కొంత ఇంటివైపు వచ్చిన యజమాని రఘు.. సీన్ చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read:  బార్డర్ వద్ద అనుమానాస్పదంగా డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు