
హైదరాబాద్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. చందానగర్‌లో భారీ దోపిడికి యత్నించారు. ఐదుగురు దుండగులు ఖజానా జ్యువెలరీ షాప్‌లో చొరబడి గన్‌తో కాల్పులు జరిపారు. చంపేస్తామని బెదిరించి లాకర్ కీ తీసుకున్నారు. షాపు లోపలి స్టాల్స్ అన్నీ పగలగొట్టారు. ఇంతలో పోలీసులు రావడంతో డిప్యూటీ మేనేజర్ కాళ్లపై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. దోపిడికి పాల్పడ్డ దుండగులు జహీరాబాద్ వైపు పారిపోగా.. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు .రెండు రౌండ్లపాటు కాల్పులు జరిపిన దుండగులు.. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దొంగలను పట్టుకునేందుకు సైబరాబాద్ సీపీ 10టీమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టం చేశారు.
షాప్ తెరిచిన ఐదు నిమిషాల్లోనే ఈ గ్యాంగ్ దోపిడి యత్నించింది. సంఘటనాస్థలాన్ని సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. నిందితులను వీలైనంత త్వరంగా పట్టుకుంటామని చెప్పారు. కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్‌కు తీవ్ర గాయాలవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే షాపులో వెండి ఆభరణాలు ఎత్తికెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. అంతకుముందు దుండగులు కూకట్ పల్లిలో రెండు ఇండ్లలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నగరంలో ఒక్కసారిగా కాల్పుల మోతతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..