Telangana: ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్.. సీన్ చూసిన పోలీసులే షాక్..?

| Edited By: Balaraju Goud

Dec 14, 2024 | 5:02 PM

దొంగల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. ఎస్‌బీఐ ఏటీఎంలను మాత్రమే ఎంచుకుంటున్న ఈ ముఠా చాకచక్యంగా కొల్లగొట్టింది.

Telangana: ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్.. సీన్ చూసిన పోలీసులే షాక్..?
Atm Robbery
Follow us on

దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అక్కడ.. ఇక్కడ అనే తేడాలేం లేవు..! ఎక్కడబడితే అక్కడ.. చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంత టెక్నాలజీని వాడుతున్నా.. ఏమాత్రం అదురూబెదురూ లేకుండా చోరీలు చేసేస్తున్నారు దొంగలు. చివరికి సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలను సైతం వదలడం లేదు. తాజాగా.. వరుస చోరీలతో హడలెత్తించారు ఏటీఎం దొంగలు. అయితే.. సాధారణంగా దొంగతనాలు జరగడం ఒక ఎత్తయితే.. నల్లగొండ జిల్లాలో జరిగిన చోరీ మరో ఎత్తు అని చెప్పొచ్చు..!

సాధారణంగా పెప్పర్ స్ప్రేను మహిళలు, యువతులు ఆత్మ రక్షణ కోసం వినియోగించాలని సూచిస్తుంటారు. ఎవరైనా శత్రువులపై ప్రయోగించేందుకు పెప్పర్స్ స్ప్రే యూస్ చేయడం చూశాం. కానీ పెప్పర్ స్ప్రేను దొంగలు తమ దొంగతనాల ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు పెప్పర్ స్ప్రే వాడుతున్నారు. అయితే ఇక్కడ ఏటీఎంను చోరీ చేసిన దుండగులు పెప్పర్ స్ప్రేను ఎలా వాడారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

నల్లగొండ జిల్లా దామచర్ల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను గుర్తు తెలియని కొందరు దుండగులు లూటీ చేశారు. 20 లక్షల రూపాయలను చోరీ చేశారు. ఏటీఎంను లూటీ చేసేందుకు దుండగులు పెప్పర్ స్ప్రే తో ఏం చేశారంటే.. దామరచర్లలో అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఎస్‌బీఐ ఎటిఎం ఉంది. అర్ధరాత్రి వేళ దుండగులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్లాన్ చేశారు. తమ వెంట పెప్పర్ స్ప్రే ను తీసుకుని వచ్చి ఏటీఎంలోని సీసీ కెమెరాలు స్ప్రే చేశారు. తమ ఆనవాళ్లు సీసీ కెమెరాలు రికార్డు కాకుండా పెప్పర్ స్ప్రేను యూస్ చేశారు. ఏటీఎంలో పగలగొట్టి అందులోని 20 లక్షల రూపాయలను చోరీ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ లతో ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాలకు దుండగులు పెప్పర్ స్ప్రే కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఏటీఎం చోరీ దొంగలను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలతో పోలీసులకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..