Hyderabad: కారులో నన్ను దారుణంగా కొట్టారు.. ఘోరంగా ట్రీట్ చేశారు.. కిడ్నాప్ బాధితురాలి ఆవేదన..

|

Dec 10, 2022 | 7:09 PM

హైదరాబాద్ లో సంచలనం కలిగించిన యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు.. తనను బలవంతంగా కిడ్నాప్ చేశారని వెల్లడించారు. చాలా...

Hyderabad: కారులో నన్ను దారుణంగా కొట్టారు.. ఘోరంగా ట్రీట్ చేశారు.. కిడ్నాప్ బాధితురాలి ఆవేదన..
Hyderabad Kidnap
Follow us on

హైదరాబాద్ లో సంచలనం కలిగించిన యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు.. తనను బలవంతంగా కిడ్నాప్ చేశారని వెల్లడించారు. చాలా ఘోరంగా ట్రీట్ చేశారన్న ఆమె.. కారుతో తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. నవీన్ రెడ్డితో తనకు ప్రేమ లేదని, పెళ్లి కూడా జరగలేదని స్పష్టం చేశారు. పెళ్లి జరిగిందని చెబుతున్న రోజున.. తాను హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. నవీన్ తనను కిడ్నాప్ చేసి హింసించాడన్న ఆమె తన ఫొటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్ ను నాశనం చేశాడని కన్నీటిపర్యంతమయ్యారు.

ఆదిభట్లలోని మన్నెగూడకు చెందిన ఓ యువతి బీడీఎస్‌ పూర్తి చేసింది. ఆమెకు తాజాగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆమె పేరెంట్స్‌ పెళ్లి చూపులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న నవీన్‌ రెడ్డి.. సుమారు వంద మందితో వచ్చి యువతి ఇంటిపై దాడి చేశారు. అనంతరం యువతిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. హైదరాబాద్‌ ఆదిభట్లలోని మన్నెగూడాలో ఈ కిడ్నాప్‌ వ్యవహారం సంచలనం సృష్టించింది.

ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. యువతి కిడ్నాప్‌ అయిన గంటల వ్యవధిలోనే అమ్మాయిని అధికారులు కాపాడారు. శుక్రవారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన వైశాలిని కిడ్నాపర్లు నల్గొండ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు 31 మందిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..