High Court judges: హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

|

Aug 18, 2021 | 10:25 PM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఇవాళ సిఫారు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం న్యాయాధికారుల కోటాలో

High Court judges:  హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
Telangana High Court
Follow us on

Supreme Court collegium: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఇవాళ సిఫారు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం న్యాయాధికారుల కోటాలో ఈ మేరకు సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి జస్టిస్‌ పి.శ్రీరాధ, జ్యూడీషియల్‌ అకాడమీ డైరక్టర్‌ సి.సుమలత, తెలంగాణ వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ జి.రాధారాణి, ఖమ్మం ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్‌, తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి తుకారాంజీ, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌కంట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడీషియల్‌ సభ్యులు పి.మాధవిదేవి పేర్లు ఉన్నాయి.

రాష్ట్ర హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచిన కీలక ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంతకం చేసిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించగా.. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి పేర్లను సిఫారసు చేసింది. ఇలాఉండగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకేసారి 24 నుంచి 42కి పెరిగింది. పెండింగ్‌ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని 2019 ఫిబ్రవరి 13న అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపడం తదనంతర పరిణామాల నేపథ్యంలో వేగంగా అడుగులు పడ్డాయి.

Read also: Hyderabad: పోలీసులకు పాలాభిషేకం.. సత్వర న్యాయం చేసినందుకు రుణం తీర్చుకున్న బాధితుడు