Telangana: భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు.. ఆందోళనకు సిద్ధమవుతోన్న.

|

May 15, 2023 | 7:08 AM

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా భైంసాలో 'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శను పోలీసులు అడుకున్నారు. శుక్రవారం నుంచి సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న కమల థియేటర్‌లో చిత్ర ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే.. ఉదయం ఆట ఆరంభమయ్యే సమయానికి ముందు...

Telangana: భైంసాలో ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు.. ఆందోళనకు సిద్ధమవుతోన్న.
The Kerala Story
Follow us on

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శను పోలీసులు అడుకున్నారు. శుక్రవారం నుంచి సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న కమల థియేటర్‌లో చిత్ర ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే.. ఉదయం ఆట ఆరంభమయ్యే సమయానికి ముందు ప్రదర్శన నిలిపి వేయాల్సిందిగా థియేటర్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు భైంసా పట్టణ పోలీసులు. దాంతో.. థియేటర్‌ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపి వేసింది.

అయితే.. సినిమా చూసేందుకు వచ్చినవారు పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సున్నిత ప్రాంతం కావడంతో సినిమా ప్రదర్శనకు అనుమతిలేదని చెప్పారు పోలీసులు. ఒక దశలో థియేటర్‌ యాజమాన్యానికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీ శ్రేణులతో కలిసి థియేటర్‌ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. హిందూవాహిని మహిళా విభాగం శ్రేణులు సైతం ఆందోళన చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు.. థియేటర్‌ సమీపంలోని వ్యాపార సంస్థలన్నింటినీ మూసి వేయించారు. ఇక.. భైంసా పోలీసుల తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమా ప్రదర్శనను పోలీసులు ఎలా అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని ఆంక్షలు బైంసాలోనే ఎందుకు అంటున్న హిందూ వాహిని ప్రశ్నిస్తోంది. సినిమా ప్రదర్శన నిలిపి వేస్తే ఆందోళనకు సిద్ధమని హిందువాహిని ప్రకటించింది. ఇక థియేటర్‌ యాజమాన్యం సైతం సెన్సార్ బోర్డు పర్మిషన్ ఉండగా ప్రత్యేక అనుమతులు ఎందుకని ప్రశ్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..