తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం తర్వాత జయజంకర్ భూపాలల్లి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాల కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.
వర్షాలతో పాటు గంటకి 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్సాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 25,26,27 తేదీల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ద్రోణి రాయలసీమ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఝార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..