Telangana: టామాటా కూర తెచ్చిన తంటా.. తల్లిపై కత్తితో దాడి చేసిన కుమారుడు.. అలా చేసిందనే..
ఒక ఇంట్లో టమాట కూర తీసుకొచ్చిన తంటా.. సొంత తల్లిపైనే దాడికి పాల్పడేలా చేసింది. ఆమెను ఆస్పత్రి పాలు చేసింది. చివరకు పోలీసులను ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చింది. వినడానకి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఘటన...

ఒక ఇంట్లో టమాట కూర తీసుకొచ్చిన తంటా.. సొంత తల్లిపైనే దాడికి పాల్పడేలా చేసింది. ఆమెను ఆస్పత్రి పాలు చేసింది. చివరకు పోలీసులను ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చింది. వినడానకి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఘటన నిజ్జంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ హాట్ టాపిక్ గా మారింది. మహబూబాబాద్ జిల్లా వేంనూర్‌లో బుజ్జి అనే మహిళ నివాసముంటోంది. ఆమె కుమారుడు, కోడలు కూడా ఆమెతోనే కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కూర వండమని బుజ్జి కోడలికి చెప్పింది. దీంతో ఆమె టమాట కూర వండింది. అది రుచిగా లేకపోవడంతో బుజ్జి ఆమెను మందలించింది. ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్తా చినికి చినికి గాలి వానలా మారింది. విషయాన్ని కోడలు తన భర్త మహేందర్‌కు చెప్పింది.
దీంతో తీవ్ర ఆగ్రహంతో మహేందర్ తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బుజ్జికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెకు.. చికిత్స అందించేందుకు మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు.. ఆమె తలకు కుట్లు వేశారు. అనంతరం ఇంటికి పంపించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..



