Telangana: వర్షంలో బంగారం వేట.. వరదలో కొట్టుకొచ్చే నాణేలు.. ఈ బంగారు బావి ఎక్కడుందో తెలుసా?

చరిత్రలో భాగమైన బంగారు బావి నిరాదరణకు గురవుతుంది. కాకతీయుల కళా సంపద రూపు రేఖలు కోల్పోతుంది. సరైన రక్షణ చర్యలు లేక గుప్త నిధుల తవ్వకాలతో కలావిహీనంగా మారుతోంది. నిత్యం బంగారం కోసం దుండగులు తవ్వకాలు జరుపుతున్నారు. జంతు బలి, క్షుద్రపూజలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకప్పుడు రాజులు, రాణులు స్నానం ఆచరించిన బావి చెత్తా చెదారంతో నిండిపోయింది.

Telangana: వర్షంలో బంగారం వేట.. వరదలో కొట్టుకొచ్చే నాణేలు.. ఈ బంగారు బావి ఎక్కడుందో తెలుసా?
Bangaru Bavi
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Dec 19, 2024 | 5:36 PM

ఇది అత్యంత పురాతన బావి.. దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి బావిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి బావులు చూడటం అరుదు..! పూర్వీకులు ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పకళా సంపద. చుట్టూ రాతి కట్టడంతో, ఇరు వైపుల గదులతో అందంగా కనిపిస్తుంది. అయితే, ఈ బావి లో భారీగా బంగారు సంపద ఉందని చరిత్ర ఆనవాళ్లు ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగంతకులు నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు. ఈ బావి లో ఎటు చూసిన తవ్వకాలనే కనబడుతున్నాయి.

కరీంనగర్ సమీపంలో ఎలగందుల పురాతన గ్రామం ఉంది. ఈ ఖిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఖిల్లా నుంచీ.. 500 మీటర్ల దూరంలో నాగయ్య బావి ఉంది. ఈ బావికి సమీపంలో నాగదేవాలయం ఉంటుంది. అందుకే.. దీనికి నాగయ్య బావిగా పిలుస్తుంటారు స్థానికులు. ఈ బావి కాకతీయులు కాలంలో నిర్మాణం చేపట్టారు. పూర్తిగా రాయితో కట్టడాలు నిర్మించారు. ఇప్పటికీ.. ఈ కట్టడాలు చెక్కు చెదురులేదు. ఈ బావిలో రాజులు.. రాణులు స్నానం ఆచరించేవారని చరిత్ర చెబుతోంది.

ఈ బావి పక్కన రెండు పురాతన గదులను నిర్మించారు. కాకతీయులు వారి సంపదన ఈ బావి పక్కనే దాచి పెట్టారని చరిత్ర ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది. దీనిని బంగారు బావిగా కూడా పిలుస్తారు. పై నుంచి కింది వరకు రాళ్లతో నిర్మాణం చేపట్టారు. దేవాలయ నిర్మాణం లాగానే.. ఈ బావి ని నిర్మించారు. ఈ బావి లో ఎప్పటికీ నీరు ఉంటుంది. అయితే బంగారు బావిపై కన్నేసిన దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో అందమైన బంగారు బావి కళావిహీనంగా మారిపోయింది.

ముఖ్యంగా వేసవి కాలంలో తక్కువ నీరు ఉన్న సమయంలో దుండగులు తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. బావి పక్కన ఉన్న గదుల్లో తవ్వకాలు చేపడుతున్నారు. బంగారం కూడా దొరికిందనే ప్రచారం సాగింది. అంతేకాదు. భారీ వర్షాలు కురిసినప్పుడు బావి నీరు బయటకు వస్తుంది. ఆ సమయంలో బంగారు నాణెలు కొట్టుకు వస్తాయంటున్నారు స్థానికులు. అందుకే ఈ ప్రాంతంలో గుప్త నిధుల ముఠా ఎప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. గతంలో మేకతో పాటు, ఇతర జంతువులను ఈ బావి సమీపంలో బలి ఇచ్చి అనవాళ్లను స్థానికులు గుర్తించారు. పసుపు, కుంకుమతో పాటు పూజ సామాగ్రి పెట్టారు. ఇది చూసి స్థానికులు భయపడుతున్నారు. అమవాస్య, ఇతర రోజుల్లో.. ఈ బావి సమీపంలో తవ్వకాలు చేస్తున్నారు గుప్త నిధుల ముఠాలు.

అయితే సహజంగానే. కాకతీయులు ఎక్కడ పాలన చేసినా అక్కడ.. నిధులు ఉంటాయని చరిత్ర చెబుతోంది. భారీ సంపద దాచిపెడుతుంటారు. కట్టడాల సమీపంలో బంగారం దాచిపెట్టేవారు. ఈ బావి సమీపంలో కూడా బంగారం ఉందనే ప్రచారం జోరుగా ఉంది. అందుకోసం నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు. అయితే, ఈ బావిలోని నీరు పూర్తిగా స్వచ్చంగా ఉంటుంది. పురాతన బావి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ.. ఇలాంటి బావులు కనబడటం అరుదు. పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మించిన ఈ బావి.. దాదాపు 60 ఫీట్ల వరకు లోతు ఉంటుంది. బావి పక్కన బట్టలు మార్చుకునే గదులు.. విశ్రాంతి తీసుకునే గదులు ఉన్నాయి. ఈ బంగారు బావిపై అందరి దృష్టి ఉంది. ఈ బావిని చూడడానికి పర్యాటకులు వస్తున్నారు. చరిత్రలో భాగమైన బంగారు బావి నిరాదరణకు గురై రూపు రేఖలు కోల్పోతుంది. సరైన రక్షణ చర్యలు లేవు. ఈ బావి ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. శిల్ప సంపదతో పాటు.. చరిత్రకారులు చెక్కిన నాటి శిలాక్షరాలను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగాలో తెలుసా..
చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగాలో తెలుసా..
దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది
దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది
సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్‌.. సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు
సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్‌.. సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు
కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.3 లక్షల కోట్లు ఆవిరి
కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.3 లక్షల కోట్లు ఆవిరి
రోడ్డు రోలర్ శబ్దాన్ని భూకంపంగా పొరబడి..భవనంలోంచి దూకేసిన బాలికలు
రోడ్డు రోలర్ శబ్దాన్ని భూకంపంగా పొరబడి..భవనంలోంచి దూకేసిన బాలికలు
ఆర్ నారాయణమూర్తి ప్రేమకథ..
ఆర్ నారాయణమూర్తి ప్రేమకథ..
అల్పపీడనం తీవ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో భారీ వర్షాలు
అల్పపీడనం తీవ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో భారీ వర్షాలు
పితృదోషం నుంచి ఉపశమనం కోసం అమావాస్య రోజున వీటిని దానం చేయండి
పితృదోషం నుంచి ఉపశమనం కోసం అమావాస్య రోజున వీటిని దానం చేయండి
ఈ ఫోటోలో మొదటిగా కనిపించేది మీరెలాంటి వారో చెప్పేస్తుంది..ఎలాగంటే
ఈ ఫోటోలో మొదటిగా కనిపించేది మీరెలాంటి వారో చెప్పేస్తుంది..ఎలాగంటే
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..