AP Rains: అల్పపీడనం తీవ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఇక పడతాయా.? బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపధ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం రాష్ట్రంలో పలు జిల్లాలకు వచ్చే 3 రోజులు సూచనలు ఇలా ఇచ్చింది. మరి అవేంటి.? ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి.? ఈ స్టోరీ తెలుసుకుందామా పదండి.!

AP Rains: అల్పపీడనం తీవ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో భారీ వర్షాలు
Andhra Weather Report
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 19, 2024 | 5:17 PM

నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం డిసెంబర్ 19వ తేదీ ఉదయం 8.30 గంటలకు పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ వరకు విస్తరించి ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దాదాపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాత తదుపరి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

గురువారం:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి.

శుక్రవారం:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

శనివారం:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-

గురు, శుక్ర, శనివారాల్లో:

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..