అందుకే బెల్లం మంచిదట..! లాభాలు తెలిస్తే..

Jyothi Gadda

19 December 2024

TV9 Telugu

తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

TV9 Telugu

ఇందులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. బెల్లంలో ఉండే ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత ఎదురుకాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం దీనికి ఉంది.

TV9 Telugu

గర్భిణులు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

TV9 Telugu

రోజుకో చిన్న బెల్లం ముక్క తినే మహిళల్లో నెలసరి సమస్యలు చాలావరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బెలం తినటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

TV9 Telugu

ఇందులో యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్యా ఉండదు. బెల్లం తింటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. 

TV9 Telugu

ఇది డీటాక్సిఫికేషన్‌ ఏజెంట్‌గా పనిచేసి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. బరువూ నియంత్రణలో ఉంటుంది. నీరసంగా అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే తక్షణ శక్తి వస్తుంది.

TV9 Telugu

బెల్లంలోని పోషకాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత బెల్లం ముక్క తినడం మంచిది. పాలలో బెల్లం వేసుకుని తాగినా మంచిదే. 

TV9 Telugu

బెల్లంలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి కొత్త నిగారింపు ఇస్తాయి. స్కిన్ గ్లో పెంచుతాయి. స్కి్న టోన్ మెరుగుపరుస్తాయి. మొటిమలు కూడా తగ్గుతాయి.

TV9 Telugu